FREE Website, FREE CRM, ₹0 లో మీ Business యొక్క Digital Identity: ఇది Scheme కాదు, ఇది మా Mission

Upcoming Avatar

By Upcoming Tools | Zero Warrior Initiative

మొదట ఒక్క విషయం అడగాలి మిమ్మల్ని

మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీ business మొదలుపెట్టినప్పుడు మీ దగ్గర ఎంత capital ఉంది? ఎన్ని connections ఉన్నాయి? ఎంత experience ఉంది? చాలా మంది ఇచ్చే సమాధానం ఒక్కటే: ఏమీ లేదు Bro అని. కానీ ఒక్క విషయం మాత్రం ఉంది అందరికి. అది గుండె నిండా ఉన్న పట్టుదల, కష్టపడే తత్వం, ఆ ఒక్క shop లేదా workshop ని నిలబెట్టుకోవాలని ఉన్న మొండి తత్వం. ఆ పట్టుదలే మీ అసలైన capital. Upcoming Tools కి అదే కావాలి.

మేము software engineers. మేము enterprise systems build చేస్తాం, cloud architectures design చేస్తాం, AI pipelines run చేస్తాం. కానీ మేము మా roots మర్చిపోలేదు. Andhra Pradesh లో పుట్టి, tier-2 cities లో పెరిగి, లోకల్ market లో మా కుటుంబాలు struggle చేయడం చూశాము. ఆ pain మాకు తెలుసు. అందుకే మేము Zero Warrior Initiative మొదలుపెట్టాము. ఇది ఒక CSR program కాదు. ఇది మా commitment. Verified rural మరియు village small business owners కి మేము free website design and hosting, free CRM setup, మరియు free local SEO అందిస్తున్నాం. పూర్తిగా ₹0 cost లో.

“Free” అంటే? తర్వాత డబ్బులు అడుగుతారు ఏమో ?

సరైన question. marketలో అందరూ అలాగే ఉన్నారులే bro: ఏదైనా free అంటే ఎక్కడో ఒక hidden cost ఉంటుంది, మనకి దూల తీరిపోతుంది అని మనకి doubt రావటం సహజం. ఇక్కడ ఒక్క concept మాత్రమే ఉంది: మీరు genuine గా struggle చేస్తున్నా, inspiring journey ఉన్నా, మీకు అసలు ఎవరూ support చెయ్యకపోయినా, చాలా పేద కుటుంబం నుంచి వస్తున్నా? మా team ఐ email చెయ్యచ్చు! next step: మీరు మా team ద్వారా verified rural లేదా village entrepreneur అయి ఉండాలి. అంతే.

మేము మీ bank account balance చూడం. మేము మీ caste అడగం. మేము మీ educational qualifications అస్సలు అడగము bro. మేము ఒక్క విషయం మాత్రమే చూస్తాం: మీ story. మీరు ఏ circumstances లో మీ business మొదలుపెట్టారు? మీరు ఏ obstacles దాటారు? మీ grit మీరు చెప్పిన దానిలో కనిపిస్తే, మీ application verify అయితే, మేము మీ free business website తో పాటు complete digital presence for rural entrepreneurs మొత్తం build చేసి మీ చేతిలో పెడతాం. No hidden fees. No monthly subscriptions. No surprises. మళ్ళీ మళ్ళీ చెపుతున్నాం (మేము రూపాయి ఇవ్వము , రూపాయి తీసుకోము.) మేము ఇదంతా కూడా చేసేది మన విలేజెస్ లో ఉన్న Ideasని బయటికి తీసుకురావడానికి మాత్రమే.

ఒక Village Business కి Website అవసరమా? నిజంగా అవసరమా?

ఇది చాలా మంది అడిగే question. “మా shop కి regular customers వస్తున్నారు. మేము WhatsApp లో orders తీసుకుంటున్నాం. Website ఎందుకు?” ఈ logic తో పాటు మరొక reality కూడా ఉంది. ఈ రోజు ఒక customer మీ product కావాలనుకున్నప్పుడు వాళ్ళు first చేసే పని Google లో search చేయడం. మీ business Google లో కనిపించకపోతే, ఆ customer మీకు reach అవ్వడు. Simple గా చెప్పాలంటే, ఈ రోజు digital presence లేని business అంటే, రాత్రి పూట lights ఆఫ్ చేసి దుకాణం పెట్టుకున్నట్టే.

ఇది rural areas కి మరింత critical. ఎందుకంటే cities లో ఉన్న buyers, corporates, NGOs, మరియు government procurement officers ఈ రోజు local artisans, village manufacturers, మరియు rural cooperatives తో directly connect అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి మీ product కావాలి. వాళ్ళకి మీ craftsmanship కావాలి. కానీ వాళ్ళు కలవలేకపోతున్నారు. ఎందుకంటే మీకు online presence లేదు. ఒక proper website ఉంటే మీరు ఆ వాళ్లని, వాళ్ళు మిమ్మల్ని contact చేయగలరు.

Amazon మరియు Flipkart లో products sell చేయడానికి ముందు buyer మీ credibility check చేస్తాడు. Bank loan apply చేసినప్పుడు officer మీ business legitimacy verify చేస్తాడు. Government tender fill చేయాలంటే online presence mandatory గా అడుగుతారు. ఇవన్నీ ఒక simple, clean, professional website వల్ల solve అవుతాయి. మరియు ఆ website కోసం మీరు ₹0 cost website India model లో Upcoming Tools దగ్గరకు రావచ్చు.

మేము ఎవరికోసం ఈ Initiative తీసుకొచ్చాము?

ఈ program ఒక్క type of person కోసం కాదు. మేము వేరే వేరే backgrounds నుండి వచ్చిన entrepreneurs కోసం design చేశాము దీన్ని. కానీ కొన్ని specific profiles మా దగ్గర అత్యంత quickly verify అవుతాయి.

మొదటిది, village లో single-product shop run చేస్తున్న entrepreneur. ఒక్క product మీద focus చేసి, దాన్నే పూర్తిగా perfect చేసి, local market లో నిలబెట్టుకున్న వ్యక్తి. వాళ్ళ దగ్గర ఒక నిజమైన story ఉంటుంది. ఒక తాతల నాటి నుండి వస్తున్న recipe అయినా సరే, ఒక village లో తయారయ్యే మట్టి కుండ అయినా, handloom product అయినా సరే.

రెండవది, women-led self-help groups మరియు cooperatives. ఇవి మా heart కి అత్యంత close. ఒక్క village లో పది మంది women కలిసి ఒక product (ఉదాహరణకు: తాటి తాండ్ర, పీచుమిఠాయి, అగరబత్తులు….) చేస్తున్నారు, మార్కెట్ కి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారు అని, ఆపని తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళకి ఒక online presence ఉంటే, ఆ product directly buyers చేతికి చేరుతుంది. మా free website for women entrepreneurs India offer వాళ్ళ కోసమే.

మూడవది, rural artisans మరియు traditional craft makers. Kalamkari, Kondapalli toys, Etikoppaka lacware, Pochampally ikat, ఇవన్నీ world-class products. కానీ ఈ artisans చాలా మంది middlemen మీద depend అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి direct buyer access లేదు. ఒక free online presence for village shop వాళ్ళకి middleman dependency తగ్గించి, direct income పెంచగలదు.

నాల్గవది, first-generation entrepreneurs. వాళ్ళ family లో ఎవరూ business చేయలేదు. వాళ్ళు first person గా ఒక step వేశారు. ఆ courage కి మేము respect చేస్తాం. వాళ్ళ journey మాకు verify చేయడానికి అత్యంత easy అవుతుంది ఎందుకంటే ఆ stories genuinely inspiring గా ఉంటాయి.

మేము Exactly ఏం Build చేస్తాం? ₹0 లో ఏం వస్తుంది?

అసలు మీకు మేము ఏమి డెలివరీ చేద్దాం అనుకుంటున్నాము అనేది Clear గా చెప్పాలి. లేకపోతే మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు.

Professional Website Design and Hosting: మేము మీ business కోసం custom designed, mobile-responsive website build చేస్తాం. ఇది cheap template కాదు. మీ brand, మీ product, మీ story reflect అయ్యేలా design చేస్తాం. ఆ website hosting మేమే handle చేస్తాం. Domain registration నుండి live అయ్యే వరకు పూర్తి process మాదే.

Free Local SEO Setup: Website build చేయడం మాత్రమే కాదు, ఆ website Google లో కనిపించేలా చేయడం కూడా మా బాధ్యత. మీ business ని Google My Business లో register చేస్తాం. Location-based keywords optimize చేస్తాం. Free local SEO for small business అంటే exactly ఇదే. మీ పక్కన ఉన్న village నుండి మొదలుకొని district level వరకు మీ customers ని Google లో easily find చేయగలిగేలా చేయడం.

Free Zoho CRM Setup: ఇది చాలా మంది expect చేయరు. కానీ మేము చేస్తాం. Customer names, orders, follow-ups, payment pending అన్నీ ఒకే place లో track చేయడానికి free Zoho CRM setup for small business configure చేసి, మీకు complete training videos షేర్ చేస్తాము (you tube లో ఉన్నాయిలే) కూడా ఇస్తాం. మీరు Notebook పక్కన పెట్టే time వచ్చింది.

Basic Content Writing: మీకు website కోసం ఏం రాయాలి అని తెలియకపోయినా problem లేదు. మీ business గురించి మాకు చెప్పండి, మేము professional గా content తయారు చేస్తాం. మీ products, మీ story, మీ contact information అన్నీ properly present అవుతాయి. (10 Blog posts రాస్తాము)

One Month Post-Launch Support: Website live అయిన తర్వాత first month లో ఏదైనా issue వస్తే, ఏమయినా tech issues వస్తే? మేము 1 నెల మొత్తం free సపోర్ట్ ఇస్తాము. మీరు hosting purchase చేస్తే, మీ domain and files మేమే freeగా మీ అకౌంటుకి transfer చేసేస్తాము. (మేము మీకు స్టార్టింగ్ టైంలో supportగా ఉంటాము, మీకు రెక్కలు వచ్చాక మీరు ఎగిరిపోతారు. కానీ మమ్మల్ని మర్చిపోకండి!

Verification Process ఎలా పని చేస్తుంది?

మీరు application submit చేసిన తర్వాత మేము ఏం చేస్తాం అని అర్థం చేసుకోవడం important. ఇది complicated process కాదు, కానీ ఇది serious process.

మీరు మీ business story మాకు mail చేస్తారు. మీరు business ఎందుకు start చేశారు, ఏ challenges face చేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం achieve చేయాలని ఉంది అని వివరంగా తెలుగులో Email చెయ్యండి. AI generated email మేము ఓపెన్ కుడా చెయ్యము.

మా team మీ story మొత్తం చదువుతారు. తర్వాత మేము మీతో phone లో brief conversation చేస్తాం. ఇది interview లా feel అవ్వదు, ఇది simple conversation మాత్రమే. మీ business గురించి, మీ current situation గురించి మాట్లాడతాం. ఆ conversation తర్వాత మీ application genuine అని confirm అయితే, మేము immediately onboarding start చేస్తాం.

మీ వెరిఫికేషన్ కి, website design చెయ్యటానికీ కొంచెం అటు ఇటుగా ఏడు రోజుల నుంచి 15 రోజులు పడుతుంది

Internet లేని చోట Website Work అవుతుందా?

Rural areas లో internet connectivity inconsistent గా ఉంటుంది. మన అందరికి ఆ reality తెలుసు. కానీ మీ website buyers కోసం ఉంటుంది, మీ shop లో internet కోసం కాదు. మీ customer Hyderabad లో, Chennai లో, Mumbai లో, UK లో ఎక్కడ నుండైనా మీ website access చేయగలడు. మీ shop లో internet slow గా ఉన్నా, మీ website 24 గంటలూ 7 రోజులూ online గా ఉంటుంది.

అయినప్పటికీ, మేము మీ website ని extreme performance optimization తో build చేస్తాం. Low-bandwidth connections మీద కూడా మీ website clearly మరియు quickly load అవుతుంది. ఇది technical detail అయినా దాని result simple: మీ customer మీ website visit చేసినప్పుడు frustrated గా feel అవ్వకుండా ఉంటాడు.

CRM data కి వస్తే, Zoho CRM offline mode support చేస్తుంది. Internet లేని సమయంలో మీరు చేసిన entries auto-sync అవుతాయి connection వచ్చినప్పుడు.

మీరు Apply చేయడానికి ముందు చేయాల్సిన Checklist

మీ application strong గా ఉండేలా, మీ verification quickly అయ్యేలా, మీరు maximum benefit తీసుకోగలిగేలా ఈ checklist follow చేయండి.

మీ Story Preparation:

మీ business ఎప్పుడు, ఎందుకు start చేశారు అని clearly explain చేయగలగాలి. Exact date లేకపోయినా సరే, year మరియు పరిస్థితులు చెప్పగలగాలి. మీరు face చేసిన top 3 challenges honestly describe చేయాలి. పులిహారా కబుర్లు అస్సలు చెప్పకూడదు, genuine గా చెప్పండి. మీ current monthly revenue approximate గా share చేయడానికి comfortable గా ఉండాలి. ఇది judgment కోసం కాదు, verification కోసం. మీ business future కి ఏం చేయాలని ఉంది అని 2-3 paragraphs లో చెప్పగలగాలి.

Documents మీ దగ్గర Ready గా ఉండాలి:

మీ Aadhar card copy, మీ business location proof, మీ product యొక్క కొన్ని photos (mobile phone photos సరిపోతాయి), మీ existing customers WhatsApp లేదా contacts reference కి ready చేసుకోండి. MSME certificate ఉంటే excellent, కానీ mandatory కాదు.

Website కోసం Basic Information Prepare చేసుకోండి:

మీ business పేరు exactly ఏమిటి, మీరు ఏ products sell చేస్తున్నారు list చేయండి, మీ price range approximate గా చెప్పండి, మీ contact number మరియు location clearly ఉండాలి, మీ product కి related 10 నుండి 15 clear photos mobile లో తీసి ready గా ఉంచుకోండి.

Zoho CRM Setup కోసం:

మీ customers ని ఏ categories లో track చేయాలని ఉంది? Regular buyers, one-time buyers, pending payments? మీ order process step-by-step ఎలా ఉంటుంది? Customer order, production, delivery, payment? ఇవి మీ CRM structure కి help అవుతాయి. ఇవి ఏమీ మీకు తెలియకపోయినా సరే, మీ ప్లాన్ మాకు వివరంగా చెప్పండి. ఎందుకంటే! మీరు ఇవి అన్నీ already try చేసిఉంటే మాదగ్గరకి రారుగా? మీకు సపోర్ట్ లేక, పరిస్థితులు బాగోలేక మాదగ్గరకి వచ్చారు . మేము అర్ధం చేసుకోగలం. ఎందుకంటే, మేముకూడా చిన్నప్పటినుంచీ ఇలాటివి చాలా చాలా చూసి ఇక్కడివరకూ వచ్చాముగా!

Post-Launch కోసం Ready అవ్వండి:

Website live అయిన తర్వాత customers నుండి enquiries వస్తాయి. వాటికి respond చేయడానికి daily 15-20 minutes time plan చేసుకోండి. WhatsApp Business account setup చేసుకోండి ఉంటే, website తో integrate చేయడం easier అవుతుంది.

ఈ ₹0 Initiative చాలా మందికి కావాలి, కానీ అందరికీ కాదు

ఇది honest గా చెప్పాల్సిన మాట. మేము limited team తో work చేస్తున్నాం. ప్రతి project కి మేము personal attention ఇస్తాం. అందువల్ల ప్రతి month limited applications మాత్రమే accept అవుతాం. First come, first serve కాదు. Most genuine, most impactful story select అవుతుంది.

మీ application submit చేయడంలో delay చేయవద్దు. కానీ fake చేయవద్దు. మా team genuine stories ని clearly identify చేయగలదు. మీ authentic journey, మీ real challenges, మీ honest ambitions అవి మీ application ని select చేయిస్తాయి. Polish చేసిన language కాదు, honest words మాకు important.

ఇది మా First Step, మీ Long-Term Growth కోసం

Zero Warrior Initiative మా relationship యొక్క beginning మాత్రమే. మీ business grow అయినప్పుడు, మీకు advanced needs వస్తాయి: custom API integrations, automated inventory systems, AI-powered customer support, enterprise dashboards. అప్పుడు మీరు paid services expect చేయగలరు, fair pricing తో, transparent quotes తో.

కానీ ఆ time వచ్చేంత వరకు, foundation strong గా build చేయడం మా job. Free website, free CRM, free SEO అవి మీ foundation. ఆ foundation మీద మీరు business build చేయండి. మీరు grow అయినప్పుడు మేము celebrate చేస్తాం. ఆ success మాకు advertisement.

మేము customers కోసం work చేయం. మేము partners కోసం work చేస్తాం. ఆ difference నమ్మే వాళ్ళకే మా Zero Warrior Initiative.

మీ Business కి ₹0 తో Digital Future మొదలవుతుంది

మీరు ఇప్పుడు ఈ article చదువుతున్నారంటే ఒక్క విషయం clear: మీరు మీ business గురించి seriously think చేస్తున్నారు. మీకు grow అవ్వాలని ఉంది. మీకు online లోకి రావాలని ఉంది. కానీ budget, technical knowledge, correct guidance లేక stuck అయి ఉన్నారు. ఇది మీ failure కాదు, ఇది system failure. Technology అందరికీ accessible గా ఉండాలి, కానీ లేదు.

Upcoming Tools ఆ gap fill చేయడానికి తయారయ్యింది. మా team మీ budget గురించి ఆలోచించదు, మీ technical knowledge గురించి judge చేయదు. మేము మీ story వింటాం, మీ grit recognize చేస్తాం, మీ free digital presence for rural entrepreneurs entire గా build చేస్తాం. Cloud setup నుండి CRM configuration వరకు, website design నుండి Google లో rank అవ్వడం వరకు, అన్నీ మేము handle చేస్తాం. మీరు మీ business మీద focus చేయండి.

ఈ రోజు మీ story మాకు mail చేయండి: upcomingtool@gmail.com కి reach అవ్వండి, మీ journey share చేయండి. Verified అయితే, మీ digital presence 10 to 15 రోజుల్లో ready. ₹0 cost. Zero hidden charges. 100% genuine. ఇది promise కాదు, ఇది మా mission.

Upcoming Tools | Democratizing Enterprise Technology for Every Indian Business | UpcomingTools.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *